Skip to main content

చాలా మందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం - poojanilayam

చాలా మందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం 

       
చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు.

కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.


గాయత్రీ మంత్రము అంటే…

“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”

ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

ఓం
భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

3. పురాణ కధనం ప్రకారం 24మంది
మహా ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకునిధర్మచక్రం లో వున్న 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు :
*ఐదు జ్ఞానేన్ద్రియాలు,
*5 కర్మేంద్రియాలు,
*పంచ తన్మాత్రలు,
*5 మహాద్భుతాలు,
*బుద్ధి, *ప్రకృతి, *అహంకారం, *మనస్సు

7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు.

10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

11. మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.

“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతాః పర దైవతం” అన్నారు పెద్దలు .

24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు.

సకల దేవతా స్వరూపం గాయత్రీ.
రామాయణ సారం గాయత్రీ .
కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ.
సకలకోర్కెలు ఈడేర్చే మహామంత్రం గాయత్రీ
24 బీజాక్షర సంపుటి గాయత్రీ..

అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

Popular posts from this blog

వివాహ పొంతన కోసం సంపూర్ణ వివరణ: వివాహ పొంతన ఏలా చూడాలి ? అష్ట గుణ కూటమి గురించి సంపూర్ణ వివరణ - marriage compatibility - Poojanilayam

 వివాహ పొంతన కోసం సంపూర్ణ వివరణ:  వివాహ పొంతన ఏలా చూడాలి ?  అష్ట గుణ కూటమి గురించి సంపూర్ణ వివరణ -  marriag e compatibility - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు. ఏ కార్యాన్ని అయిన అవలీలగా చేసే శక్తి ఈ యంత్రాల కి ఉన్నది

మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం

 మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం  గండభేరుండ నరసింహ సాధన సాధన :-  రోజుకి 324 సార్లు 41 రోజులు చేయండి  శ్రద్ద ,మానసిక నిష్ఠ, తో చేయండి   గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి అతిరహస్యము మరియు అత్యంత శక్తివంతము అయిన గండభేరుండ నరసింహ సాధన :- గండభేరుండ నరసింహ ఎనిమిది శిరస్సులతో ఉంటాడు. ఆ శిరస్సులు ఏమిటీ అంటే... 1.గండభేరుండ పక్షిరాజు : స్వామి ఈ శిరస్సుతో శరభేశ్వరుడిని మరియు అతని భార్యలు- యుద్ధంలో ఓడించాడు. ఈ ముఖాన్ని తత్సబంధిత మంత్రంతో ఆరాధించినట్లయితే అభిచార ప్రయోగాలు (చేతబడులు) మరియు క్షుద్రశక్తుల వలన కలిగే పీడలు దహనం అయిపోతాయి 2.నరసింహ మృగరాజు : శరభేశ్వరునికి సంబంధించిన వీరభద్రుడు, అఘోరా మరియు ఇతర అస్త్రమూర్తులను ఈ శిరస్సు లొంగదీసింది. ఈ శిరస్సును తత్సంబం...