మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం గండభేరుండ నరసింహ సాధన సాధన :- రోజుకి 324 సార్లు 41 రోజులు చేయండి శ్రద్ద ,మానసిక నిష్ఠ, తో చేయండి గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి ఇలా చేయవచ్చు చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి అతిరహస్యము మరియు అత్యంత శక్తివంతము అయిన గండభేరుండ నరసింహ సాధన :- గండభేరుండ నరసింహ ఎనిమిది శిరస్సులతో ఉంటాడు. ఆ శిరస్సులు ఏమిటీ అంటే... 1.గండభేరుండ పక్షిరాజు : స్వామి ఈ శిరస్సుతో శరభేశ్వరుడిని మరియు అతని భార్యలు- యుద్ధంలో ఓడించాడు. ఈ ముఖాన్ని తత్సబంధిత మంత్రంతో ఆరాధించినట్లయితే అభిచార ప్రయోగాలు (చేతబడులు) మరియు క్షుద్రశక్తుల వలన కలిగే పీడలు దహనం అయిపోతాయి 2.నరసింహ మృగరాజు : శరభేశ్వరునికి సంబంధించిన వీరభద్రుడు, అఘోరా మరియు ఇతర అస్త్రమూర్తులను ఈ శిరస్సు లొంగదీసింది. ఈ శిరస్సును తత్సంబం...