Skip to main content

అతిశక్తివంతమైన పరబ్రహ్మ గోపాల మహాసుదర్శన మాలమంత్ర సాధన

 అతిశక్తివంతమైన పరబ్రహ్మ గోపాల మహాసుదర్శన మాలమంత్ర సాధన(సర్వాభీష్ట సిద్ధికర

సర్వారిష్ట నివారక, కాలసర్పదోషనివారణ కోరుకు ,) 

ఈ సాధన వలన కోరిన కోర్కెలు తీర్చుటలో దీనికిదేసాటి సకల బాధలు కష్టములు తొలగించి సర్వ సుఖములు ప్రాప్తిస్తుంది


ఉపాసనా క్రమము : ఈ సర్వారిష్ట నివారకము సర్వాభీష్ట సిద్ధికరమగు పరబ్రహ్మ గోపాల సుదర్శన మాలామంత్రము కోరిన కోర్కెలు తీర్చుటలో దీనికిదేసాటి. అనుష్టించదలచిన ఉపాసనాపరుడు శుచిగా, నియమ నిష్టలు ఆచరిస్తూ గృహమున లేక విష్ణు / నారసింహ లేక శ్రీకృష్ణ మందిర

మునగాని నిత్యము ఉదయము 108సార్లు, సాయంత్రము 108 సార్లు వంతున 

70 రోజులు అనుష్టించిన మాలామంత్రము సిద్ధియగును మండలము (70) రోజులు పూర్తియైన తదుపరి రోజు  71వరోజున మహావిష్ణు లేక శ్రీకృష్ణ లేక లక్ష్మీనారసింహ లేక శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంభూ క్షేత్ర దర్శనము. నిద్రగావించిన మాలామంత్ర సిద్ధి, శుద్ధి యగుటేగాక తనను ఆవరించి బాధించుచున్న బాధలు నిర్వీర్యమగును. ఒకవేళ భయంకరమైన  ఇతర క్షుద్ర దేవతల ప్రయోగాలు చే బాధపడిన యెడల  ఉపాసనాపరుడు రెండుమండలములు (96రోజులు) కనీసము ధ్యానించి ఆ తదుపరి హోమాదులు, స్వయంభూ క్షేత్ర దేవతా దర్శనము, నిద్ర గావించిన ప్రయోగాదులు, అనారోగ్యము, భయంకర ఈతిబాధలు పూర్తిగ ఉపశమిస్తాయి. ఈ మంత్రమును ఉపాసించు సమయంలో కార్యము సమర్థవంతముగా సఫలీకృతమగుటకు, మిరియాలు (100గ్రా.) చేతబట్టి మాలామంత్రాన్ని జపించేది. ఉపాసనా నంతరము ఈ మిరియాలను మైల తగలకుండ ఉంచి రోజు తినవచ్చును. లేక ఇంట్లో వాడుకోవచ్చును.


గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు

చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి


#Poojanilayam

Popular posts from this blog

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు. ఏ కార్యాన్ని అయిన అవలీలగా చేసే శక్తి ఈ యంత్రాల కి ఉన్నది

ఏ కార్యాన్ని అయిన నెరవేర్చే అనుభవ పూర్వక శక్తివంతమైన రేణుక దేవి మంత్రం - poojanilayam

( చిన్నమస్త ) రేణుక అమ్మ వారి కృపకు  పాత్రులు  కావాలి అనుకునే వారు క్రింది  మంత్రాన్ని  108 సార్లు  చదవండి ఈ రోజు సాయంత్రం (రోజు 108×3  సార్లు  ఉదయం, సాయంత్రం ,ఇలా 41 రోజులు చదివితె  ఏ కోరిక   అయినా నిరవేరుతుంది) ప్రసాదం పరమాన్నం,పెరుగు ) ఓం మహా విద్యామ్ మహా  మాయాం సర్వ శక్తీ స్వరూపిణీం  భక్తానాం  ఇష్ట దాత్రీమ్  చ    రేణుకంబామ్ అహం  భజే       🔱అతి శక్తివంతమైన రేణుక దేవి మంత్రం , దాసమహావిధ్య లలో చిన్నమస్త దేవి ఇంకొక పేరు రేణుక దేవి🔱 ఓం హ్రీమ్ క్రోమ్  ఐం  శ్రీ రేణుక దేవియే నమః ఇది అమ్మవారి మూల మంత్రం పైన ఇచ్చింది  ధ్యాన  మంత్రం  రేణుక దేవి పరుషరాముని కన్న తల్లి జమదగ్ని  మహా ముని  ఇల్లాలు  ఈ అమ్మ వారు చాల శక్తివంతమైన  అమ్మవారు  ఈ అమ్మవారిని  ఎల్లమ్మ  తల్లి గా అది  జోగుల  దేవిగా  వజ్రవైరోచని(చిన్న మస్తా)  దేవి అని పిలుస్తారు ఈ అమ్మ వారి కృప  ఉంటె మనకు  భవిష్యతు  లో గరగబోయే  విషయాలు  కూడా తెలుస్తాయి    ఈ అమ్మ వారిని  (ఎరుక  చెప్పే   అమ్మవారు అనికూడా అంటారు ) ఈ అమ్మవారు వరి చేను  లో ఉంటె  *వరిగంటల ఎల్లమ్మ* అని  అమ్మవారిని నగ్నం గా పూజించే  వారు *నగ్న ఎల్లమ్మ*  అని *మావురా

చాలా మందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం - poojanilayam

చాలా మందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం          చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్” ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే… ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్