Skip to main content

మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం

 మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం 


గండభేరుండ నరసింహ సాధన


సాధన :-  రోజుకి 324 సార్లు 41 రోజులు చేయండి 

శ్రద్ద ,మానసిక నిష్ఠ, తో చేయండి

 

గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు

చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి


అతిరహస్యము మరియు అత్యంత శక్తివంతము అయిన గండభేరుండ నరసింహ సాధన :- గండభేరుండ నరసింహ ఎనిమిది శిరస్సులతో ఉంటాడు. ఆ శిరస్సులు ఏమిటీ అంటే...


1.గండభేరుండ పక్షిరాజు : స్వామి ఈ శిరస్సుతో శరభేశ్వరుడిని మరియు అతని భార్యలు- యుద్ధంలో ఓడించాడు. ఈ ముఖాన్ని తత్సబంధిత మంత్రంతో ఆరాధించినట్లయితే అభిచార ప్రయోగాలు (చేతబడులు) మరియు క్షుద్రశక్తుల వలన కలిగే పీడలు దహనం అయిపోతాయి


2.నరసింహ మృగరాజు : శరభేశ్వరునికి సంబంధించిన వీరభద్రుడు, అఘోరా మరియు ఇతర అస్త్రమూర్తులను ఈ శిరస్సు లొంగదీసింది. ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే సమస్త రోగాలు నిర్మూలించబడి మంచి ఆరోగ్యం లభిస్తుంది


3.మహావ్యాగ్ర: ఈ శిరస్సు శివ సంబంధమైన నంది, గణపతి మరియు ఇతర శివ దేవతలను శరభేశ్వరునితో సహా అణచివేసింది. ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే దేవతల నుంచి, దయ్యాల నుండి, ప్రకృతినుండి, మానవులనుండి లభించే అన్ని రకాల ప్రమాదాలు నివారించ బత్తాయి


4.హయగ్రీవ : ఈ శిరస్సును తత్ సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే అన్ని శాస్త్రాలలో నైపుణ్యం కలిగి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది


5.ఆదివరాహ :- ఈ ముఖాన్ని తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. మంచిభార్య, పుత్రులు లభిస్తారు. ఊహించని సంపదలు ప్రసాదించబడతాయి


 6.అఘోరా వానరేంద్ర : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే మన గ్రహ బాధలు తొలగిపోయి షట్కర్మ ప్రయోగంలో (అభిచార ప్రక్రియలు)

మంచి నైపుణ్యం లభిస్తుంది


7.మహా గరుడ : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే నాగ దోషం, నాగ భయం, విషభయం, పితృదోషాలు నివారణ అవుతాయి


8.భల్లూక : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే షోడశ అనగా 16 సిద్ధులు లభిస్తాయి


అయితే గండభేరుండ నరసింహునికి ఈ ఎనిమిది ముఖం కాకుండా గూఢమైన మరియు ఎవరికీ కనపడని తొమ్మిదవ ముఖం కూడా ఉన్నదని దానిని బడబానల ముఖమని పిలుస్తారు. ఆ ముఖం ఆదినారాయణునికి చెందియున్నది. ఎవరైతే మహావిష్ణువుకు అతి దగ్గర అవుతారో వారికి గండ భేరుండ నరసింహునికి చెందిన తొమ్మిదవ శిరస్సుకూడా కనిపిస్తుందని ఋషులు  తెలియజేస్తున్నారు


Popular posts from this blog

చాలా మందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం - poojanilayam

చాలా మందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం          చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్” ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే… ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్

ఏ కార్యాన్ని అయిన నెరవేర్చే అనుభవ పూర్వక శక్తివంతమైన రేణుక దేవి మంత్రం - poojanilayam

( చిన్నమస్త ) రేణుక అమ్మ వారి కృపకు  పాత్రులు  కావాలి అనుకునే వారు క్రింది  మంత్రాన్ని  108 సార్లు  చదవండి ఈ రోజు సాయంత్రం (రోజు 108×3  సార్లు  ఉదయం, సాయంత్రం ,ఇలా 41 రోజులు చదివితె  ఏ కోరిక   అయినా నిరవేరుతుంది) ప్రసాదం పరమాన్నం,పెరుగు ) ఓం మహా విద్యామ్ మహా  మాయాం సర్వ శక్తీ స్వరూపిణీం  భక్తానాం  ఇష్ట దాత్రీమ్  చ    రేణుకంబామ్ అహం  భజే       🔱అతి శక్తివంతమైన రేణుక దేవి మంత్రం , దాసమహావిధ్య లలో చిన్నమస్త దేవి ఇంకొక పేరు రేణుక దేవి🔱 ఓం హ్రీమ్ క్రోమ్  ఐం  శ్రీ రేణుక దేవియే నమః ఇది అమ్మవారి మూల మంత్రం పైన ఇచ్చింది  ధ్యాన  మంత్రం  రేణుక దేవి పరుషరాముని కన్న తల్లి జమదగ్ని  మహా ముని  ఇల్లాలు  ఈ అమ్మ వారు చాల శక్తివంతమైన  అమ్మవారు  ఈ అమ్మవారిని  ఎల్లమ్మ  తల్లి గా అది  జోగుల  దేవిగా  వజ్రవైరోచని(చిన్న మస్తా)  దేవి అని పిలుస్తారు ఈ అమ్మ వారి కృప  ఉంటె మనకు  భవిష్యతు  లో గరగబోయే  విషయాలు  కూడా తెలుస్తాయి    ఈ అమ్మ వారిని  (ఎరుక  చెప్పే   అమ్మవారు అనికూడా అంటారు ) ఈ అమ్మవారు వరి చేను  లో ఉంటె  *వరిగంటల ఎల్లమ్మ* అని  అమ్మవారిని నగ్నం గా పూజించే  వారు *నగ్న ఎల్లమ్మ*  అని *మావురా

CHINNAMASTA - POOJANILAYAM

శ్రీ చిన్న మస్తాసాధన  ( CHINNAMASTA ) - POOJANILAYAM) అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’.  ( CHINNAMASTA ) “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’. ( CHINNAMASTA )   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు పటాపంచలయ్యే ‘ ఛిన్నమస్త’  యొక్క చరిత్రను చెప్తాను ,సావధానంగా విను.ఇక్కడకి క్రోసు దూరంలో ‘ పడైవీడు’ అనే గ్రామం ఉంది. అది పూర్వం కుండిన పురి. దానికి నందన నగరమని పేరు కూడా ఉంది.పడైవీడు అంటే, ‘అరవ భాషలో’ సైనికుల విడిది అ