Skip to main content

కళ్యాణ ఘడియాలు 100 ℅ అసలు తెలుసుకోవటం ఎలా..? - poojanilayam

కళ్యాణ ఘడియాలు 100 ℅  అసలు తెలుసుకోవటం ఎలా..?

మ‌నిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్య‌మైన సంద‌ర్భం. పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌ని వ‌య‌సు వ‌చ్చిన‌ ప్ర‌తి వ్య‌క్తిలో ఆలోచ‌న మొద‌ల‌వుతుంది. కొంద‌రిలో అనుకున్న స‌మ‌యంలో వివాహం కాక.. అది ఒక‌ స‌మ‌స్య‌గా మారుతుంది. జాత‌కం ప్రకారమే వివాహ స‌మ‌యం నిర్థేశించ‌బ‌డుతుంద‌ని గ‌మ‌నించాలి. అయితే 22 సంవత్సరాల్లోపు జరిగే వివాహాలను తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలుగా చెప్పుకోవచ్చు. 28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి ఆలస్య వివాహం.

తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలకు కార‌ణం

లగ్నం, సప్తమభావముల యందు శుభ గ్రహాలు ఉండి సప్తమాధిపతి పాప గ్రహాలతో కలవకుండా శుభ గ్రహాల దృష్టి పొందడం వ‌ల్ల‌, లేదా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథున రాశిలో గాని, తుల, వృషభ రాశులలోగాని, రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు. లేదా
శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ స్థానమలలో శుభ గ్రహాలు ఉన్నప్పుడు. లేదా శుభ గ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు లేదా జ‌లతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది.

ఆలస్య వివాహానికి గల కారణాలు

లగ్నమందు, సప్తమ స్థానమందు పాపగ్రహాలు అనగా.. శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు, సప్తమ స్థానమందు 2 గాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు. లేదా ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహా లు గాని, వక్రములు గాని ఉన్నప్పుడు. లేదా  శుక్రుడు రాహువుతో గాని, శనితో గాని కలిసివున్నప్పుడు. లేదా శుక్రుడు రవి గ్రహానికి 430 201 కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు. లేదా జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని వక్రించి గాని ఉన్నప్పుడు. లేదా సప్తమ భావముపై, సప్తమాధిపై పాప గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.

ఇలా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తర్వాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించుకోవ‌చ్చు.

వివాహకాలం నిర్ణయించుటకు జాతకునికి 21 సంవ‌త్స‌రాలు దాటిన తరువాత వచ్చు దశ అంతర్దశలను పరిశీలించాలి. సప్తమాది యెక్క లేదా సప్తమ భావాన్ని చూస్తున్న లేదా సప్తమాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాధిపతి యొక్క, లేదా సప్తమాదిపతి నవాంశమందున్న రాశి నాథుని యొక్క‌ దశ, అంతర్దశలలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా పెళ్లి జరిగే స‌మ‌యం నిర్ణయించిన తర్వాత గురు గ్రహం గోచార గమనాన్ని బట్టి వివాహం జరుగే సంవత్సరం నిర్ణయించాలి. వ‌రుడి జాతకంలో శుక్రుడు, వ‌ధువు జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివాహం జరుగుతుంది.

ఉత్తరాయణ కాలంలో జన్మించిన వారికి నవాంశలో గురువు ఉన్న రాశిలోనికి గాని, గురువుకు 5, 9 స్థానాల్లోగాని రవి గోచార రీత్యా వచ్చిన నెలలో వివాహం జరుగుతుంది. దక్షిణాయణంలో జన్మించిన వారికి నవాంశలో శుక్రుడున్న రాశిలోగాని, శుక్రునికి 5, 9 స్థానాలల్లోనికి గాని గోచార రవి వచ్చిన మాసంలో పెళ్లి జరుగుతుంది. ఈ విధంగా గురువు యొక్క సంచారాన్ని బట్టి పెళ్లి జరుగు సంవత్సరం, రవి యొక్క సంచారాన్ని బట్టి వివాహం జరుగు మాసం నిర్ణయించాలి. త‌ర్వాత చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి పెళ్లి జరిగే రోజు నిర్ణయించాలి.

జాతక చక్రం పరిశీలించేటప్పుడు ఆలస్య వివాహానికి కారణం తెలుసుకొని తత్సంబంధమైన గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేయాలు చేయాలి. అప్పుడే దోషాలు తొలగి శ్రీఘ్ర వివాహం జరుగుతుంది. సప్తమస్థానంపై రాహు, కేతువుల ప్రభావం ఉన్నప్పుడు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఫ‌లితం ఉండ‌దు. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత కూడా పెళ్లి ముందు రోజు కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. ఇటువంటి వారు కనక దుర్గమ్మ వారికి 8 శుక్రవారాలు కుంకుమార్చన జరిపించ‌డం వ‌ల్ల‌ దోషాలు తొల‌గిపోతాయి.

వివాహం తొందరగా కావాలని కోరుకునే వారు 8 మంగళవారాలు హనుమాన్‌ ఆలయంలో స్వామివారికి 108 తమల పాకులతో అర్చన జరిపించ‌డం వ‌ల్ల పెళ్లి కుదుదరుతుంది. శని గ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమల పాకులలో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచ‌డం వ‌ల్ల ఆ దోషం న‌శించిపోతుంది.

ఏదో ఒక కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే శీఘ్ర వివాహ యంత్రము ధరించుట లేదా ఈ క్రింది మంత్రమును ప్రతి రోజూ 108 సార్లు పారాయణం చేయాలి.
దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయినీ. ఇలా చేయుట వల్ల కొంత ఉపశాంతి.

Popular posts from this blog

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు. ఏ కార్యాన్ని అయిన అవలీలగా చేసే శక్తి ఈ యంత్రాల కి ఉన్నది

ఏ కార్యాన్ని అయిన నెరవేర్చే అనుభవ పూర్వక శక్తివంతమైన రేణుక దేవి మంత్రం - poojanilayam

( చిన్నమస్త ) రేణుక అమ్మ వారి కృపకు  పాత్రులు  కావాలి అనుకునే వారు క్రింది  మంత్రాన్ని  108 సార్లు  చదవండి ఈ రోజు సాయంత్రం (రోజు 108×3  సార్లు  ఉదయం, సాయంత్రం ,ఇలా 41 రోజులు చదివితె  ఏ కోరిక   అయినా నిరవేరుతుంది) ప్రసాదం పరమాన్నం,పెరుగు ) ఓం మహా విద్యామ్ మహా  మాయాం సర్వ శక్తీ స్వరూపిణీం  భక్తానాం  ఇష్ట దాత్రీమ్  చ    రేణుకంబామ్ అహం  భజే       🔱అతి శక్తివంతమైన రేణుక దేవి మంత్రం , దాసమహావిధ్య లలో చిన్నమస్త దేవి ఇంకొక పేరు రేణుక దేవి🔱 ఓం హ్రీమ్ క్రోమ్  ఐం  శ్రీ రేణుక దేవియే నమః ఇది అమ్మవారి మూల మంత్రం పైన ఇచ్చింది  ధ్యాన  మంత్రం  రేణుక దేవి పరుషరాముని కన్న తల్లి జమదగ్ని  మహా ముని  ఇల్లాలు  ఈ అమ్మ వారు చాల శక్తివంతమైన  అమ్మవారు  ఈ అమ్మవారిని  ఎల్లమ్మ  తల్లి గా అది  జోగుల  దేవిగా  వజ్రవైరోచని(చిన్న మస్తా)  దేవి అని పిలుస్తారు ఈ అమ్మ వారి కృప  ఉంటె మనకు  భవిష్యతు  లో గరగబోయే  విషయాలు  కూడా తెలుస్తాయి    ఈ అమ్మ వారిని  (ఎరుక  చెప్పే   అమ్మవారు అనికూడా అంటారు ) ఈ అమ్మవారు వరి చేను  లో ఉంటె  *వరిగంటల ఎల్లమ్మ* అని  అమ్మవారిని నగ్నం గా పూజించే  వారు *నగ్న ఎల్లమ్మ*  అని *మావురా

చాలా మందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం - poojanilayam

చాలా మందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం          చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్” ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే… ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్