Skip to main content

భవిష్యత్తు ని దర్శింపచేసి ,త్రికాల జ్ఞానం ని ఇచ్చే : ఆకాషిక్ రికార్డులు దర్శింపచేసే అద్భుత మంత్రం - poojanilayam

భవిష్యత్తు ని  దర్శింపచేసి ,త్రికాల జ్ఞానం ని ఇచ్చే :  ఆకాషిక్ రికార్డులు దర్శింపచేసే అద్భుత మంత్రం

 పోతులూరి వీర బ్రహ్మం గారు,
నోష్ట్రడామస్,  వేమన, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి, హెచ్.పి. బ్లావాట్ స్కీ .....ఇంకా ఎంతో మంది సిద్ధ పురుషులు ఈ ఆకాషిక్ రికార్డులను ఉపయోగించి భవిష్యత్తు ను దర్శించారుఅద్భుత మైన ఈ  మంత్రం 41 రోజులలో 3 లక్షల జపం చేసిన ఫలితాలు కొంచం కొంచం మొదలగును
తీవ్ర సాధన వలన ఇంకా ఇంకా అభివృద్ధి చెందును

" హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్ "

గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు
చాలా శక్తి వంతమైన ఈ మంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి


ఆకాషిక్ రికార్డులు / త్రికాల జ్ఞానం : కోసం వివరణ
 ఈ ఆకాషిక్ రికార్డుల గూర్చి వర్ణించబడినవి. మనుజుల జీవితంలోని ఘటనలు, చింతనా ధారలు, భావజాలం, గతకాలపు ఘటనలు, వర్తమాన-భవిష్యత్ కాలం నాటి సంఘటనలు, ఈ భూత-భవిష్యత్-వర్తమాన కాలాల నాటి సమస్త విషయాలు...ఈ ఆకాషిక్ రికార్డులలో నిక్షిప్తమై ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక "కోడ్ లాంగ్వేజ్" లో, భద్రపరచబడి ఉంటాయని, theosophists చెబుతారు. ఈ ఆకాషిక్ రికార్డులు, అభౌతిక తలంలో అనగా ఒకానొక మార్మిక తలంలో(esoteric plane) ఉంటాయి. అయితే దివ్యజ్ఞానం పొందిన, దివ్య నేత్రం వికసించిన ద్రష్టలు , ఈ రికార్డులు చూడగలుగుతారు. మన పురాణాది సాహిత్యంలో, ఇతిహాసాలలో నారద మహర్షి పేరు , ప్రముఖంగా మనం చూస్తాం. నారదుడు త్రికాల వేది. వేదవ్యాస మహర్షి, త్రికాల వేది. హిందూ పురాణాలలో, వేదాది సాహిత్యంలో, ఇతిహాసాలలో ప్రస్తావించబడ్డ ఋషులు,మహర్షులు,సిద్ధ పురుషులు, ఆత్మ జ్ఞానులు అందరూ త్రికాల వేదులే. ఆకాషిక్ రికార్డులు చదివి చెప్పినవారే.


   అణిమాది అష్ట గౌణ సిద్ధులలో ఒకటైన "దూరదృష్టి" కలిగిన వారు, ఖచ్చితంగా, ఈ ఆకాషిక్ రికార్డులు చూడగలరు. అనుభవించగలరు.


    ఆకాషిక్ రికార్డులు కాంతిని మాత్రమే కాక, శబ్దాన్ని కూడా, తమలో పొందుపరచుకొని యుండి, అవసరమైనవారికి తిరిగి ఇస్తాయి. ఈ ఆకాషిక్ రికార్డులు, ఎన్నటికీ నాశనం చెందవు. మనం కాలం వెనుకకు వెళ్ళి, గతాగత చరిత్రలు చూడవచ్చు, అనుభవించవచ్చును.


     జీవించిన ప్రతి వ్యక్తికీ, జీవికీ...ఈ ఆకాషిక్ రికార్డులు, అత్యంత ఆత్మీయంగా ఉంటాయి. సృష్టిలో ఏదియూ నాశనము కాదు....అనే శాశ్వతత్వ నియమం ప్రకారం ఈ "ఆకాషిక్ రికార్డులు" పని చేస్తూ ఉంటాయి.


    "ఆకాషిక్ రికార్డులు" అనగా ఒక విధమైన సూక్ష్మ ప్రకంపనలు అనుకోవచ్చు. ఈ ప్రకంపనలు "కాంతి" కే కాదు, "శబ్దానికి" కూడా వర్తిస్తాయి. ఈ ఆకాషిక్ రికార్డులు అనేవి ఎప్పటికీ నాశనం కావు. ఇవి ఎల్లప్పుడూ ప్రసారమవుతూ ఉంటాయి.


    అయితే, స్వతః సిద్ధంగానే, ఈ ఆకాషిక్ రికార్డుల లోనికి, తరచి చూడడానికి చాలా సమయం పడుతుంది. దీనికి ఎంతో శ్రమ,కాఠిన్యముతో కూడిన అభ్యాసాలు, సాధన, విశ్వాసం కావలసి వస్తాయి. అయితే ఈ రోజు చాలా మంది జిజ్ఞాసువులు, ఇందులో కృత కృత్యులు అయ్యారు. వారు సిద్ధులే.


    అత్యంత గొప్ప మహనీయులు, యోగ దృష్టి ఉన్నవారు, భావ ప్రసార గ్రహణ శక్తి ఉన్నవారు, ఏదో ఒక శారీరక బాధను అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి బాధలు, ఆ వ్యక్తియొక్క ప్రకంపనలను, గణనీయంగా హెచ్చు చేయగలుగుతాయి. తద్వారా ఆ సిద్ధులు వారికి సంక్రమిస్తాయి.....    ఆత్మ జ్ఞానులైన మహనీయులు, ఈ భూమి మీదకి వచ్చేటపుడు, ఒక దుర్గుణాన్నో, ఒక వ్యసనాన్నో....ఒక్కోసారి తీసుకువస్తూ ఉంటారు. అంత మాత్రం చేత వారి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆ మహనీయులు, తాము ఎందుకు భూమిమీదకు వస్తున్నారో, వారికి తెలుసు. ఏ వ్యసనమూ,ఏ దుర్గుణమూ...వారిని కట్టడి చేయలేదని వారికి తెలుసు. తాను జీవాత్మ యొక్క పరికరమని తెలుసు.


    "ఆకాషిక్ రికార్డులు" అనేవి ఈశ్వర చైతన్యము యొక్క ఒకానొక భిన్న తలానికి చెందినవి.


    ఈ ఆకాషిక్ రికార్డులు తెరవాలంటే, మనం...మన మానవ చైతన్య స్థాయిలను , దైవీక-వైశ్విక చైతన్య స్థాయిలకు తీసుకొని వెళ్ళాలి. మనం, విశ్వంలో గల అనేకత్వాన్ని, ఏకత్వంగా చూసే దృక్పథం పెంపొందించుకోవాలి. ఆ విధంగా మన వ్యష్టి చైతన్యం రూపొంద గలగాలి.


    శతాబ్దాలుగా, సహస్రాబ్దాలుగా ఈ ఆకాషిక్ రికార్డులను, జ్ఞానులు,ఋషులు, సిద్ధ పురుషులు ఉపయోగిస్తున్నారు.

   అనంత కాల చక్రంలో, కాల క్రమంలో, కాలం మారుతూ వస్తోంది. మానవ జాతి యొక్క సామూహిక చైతన్యం ఏదైతే ఉందో....అది పరిణామం చెంది....మనిషి, తాను ఇతరులపై ఆధార పడడాన్ని తగ్గించి ఆధ్యాత్మికంగా మరింత స్వేచ్ఛ పొందే ప్రయత్నం చేసాడు.


    12 వ శతాబ్దం మధ్య కాలంలో, ఎడ్గార్ కేసీ (1877-1945)....ఆకాషిక్ రికార్డులు చదివాడు. అతనికి "sleeping prophet" అనే పేరు కలదు. ఎందుకంటే, అతను తాను నిద్రలోకి పోతూ, తన చైతన్యాన్ని-వైశ్విక చైతన్యం వైపు మరలిస్తాడు. అంటే తన వ్యక్తి చైతన్యాన్ని, విశ్వ చైతన్యంతో అనుసంధానిస్తాడు. ఈ సమయంలో "ఎడ్గార్ కేసీ"....తాను అనుభవిస్తున్న ఆకాషిక్ రికార్డులను చదువుతూ ఉంటే, ఒక వ్యక్తి ఆ రికార్డులను , గ్రంథస్తం చేసేవాడు. దాదాపు 4 దశాబ్దాలు , ఈ ఆకాషిక్ రికార్డుల సేవలను future predictions గా మానవాళికి అందించాడు. అలాగే నోష్ట్రడామస్, పోతులూరి వీర బ్రహ్మం గారు, వేమన, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి, హెచ్.పి. బ్లావాట్ స్కీ.....ఇంకా ఎంతో మంది సిద్ధ పురుషులు ఈ ఆకాషిక్ రికార్డులను ఉపయోగించి, మానవాళికి ఎంతో సేవ చేసారు.

Popular posts from this blog

చాలా మందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం - poojanilayam

చాలా మందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం          చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్” ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే… ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్

ఏ కార్యాన్ని అయిన నెరవేర్చే అనుభవ పూర్వక శక్తివంతమైన రేణుక దేవి మంత్రం - poojanilayam

( చిన్నమస్త ) రేణుక అమ్మ వారి కృపకు  పాత్రులు  కావాలి అనుకునే వారు క్రింది  మంత్రాన్ని  108 సార్లు  చదవండి ఈ రోజు సాయంత్రం (రోజు 108×3  సార్లు  ఉదయం, సాయంత్రం ,ఇలా 41 రోజులు చదివితె  ఏ కోరిక   అయినా నిరవేరుతుంది) ప్రసాదం పరమాన్నం,పెరుగు ) ఓం మహా విద్యామ్ మహా  మాయాం సర్వ శక్తీ స్వరూపిణీం  భక్తానాం  ఇష్ట దాత్రీమ్  చ    రేణుకంబామ్ అహం  భజే       🔱అతి శక్తివంతమైన రేణుక దేవి మంత్రం , దాసమహావిధ్య లలో చిన్నమస్త దేవి ఇంకొక పేరు రేణుక దేవి🔱 ఓం హ్రీమ్ క్రోమ్  ఐం  శ్రీ రేణుక దేవియే నమః ఇది అమ్మవారి మూల మంత్రం పైన ఇచ్చింది  ధ్యాన  మంత్రం  రేణుక దేవి పరుషరాముని కన్న తల్లి జమదగ్ని  మహా ముని  ఇల్లాలు  ఈ అమ్మ వారు చాల శక్తివంతమైన  అమ్మవారు  ఈ అమ్మవారిని  ఎల్లమ్మ  తల్లి గా అది  జోగుల  దేవిగా  వజ్రవైరోచని(చిన్న మస్తా)  దేవి అని పిలుస్తారు ఈ అమ్మ వారి కృప  ఉంటె మనకు  భవిష్యతు  లో గరగబోయే  విషయాలు  కూడా తెలుస్తాయి    ఈ అమ్మ వారిని  (ఎరుక  చెప్పే   అమ్మవారు అనికూడా అంటారు ) ఈ అమ్మవారు వరి చేను  లో ఉంటె  *వరిగంటల ఎల్లమ్మ* అని  అమ్మవారిని నగ్నం గా పూజించే  వారు *నగ్న ఎల్లమ్మ*  అని *మావురా

CHINNAMASTA - POOJANILAYAM

శ్రీ చిన్న మస్తాసాధన  ( CHINNAMASTA ) - POOJANILAYAM) అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’.  ( CHINNAMASTA ) “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’. ( CHINNAMASTA )   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు పటాపంచలయ్యే ‘ ఛిన్నమస్త’  యొక్క చరిత్రను చెప్తాను ,సావధానంగా విను.ఇక్కడకి క్రోసు దూరంలో ‘ పడైవీడు’ అనే గ్రామం ఉంది. అది పూర్వం కుండిన పురి. దానికి నందన నగరమని పేరు కూడా ఉంది.పడైవీడు అంటే, ‘అరవ భాషలో’ సైనికుల విడిది అ