Skip to main content

దశ మహా విద్యలు..వాటి ఫలితాలు... ఏం చేస్తే ఏం వస్తుంది? - poojanilayam

దశ మహా విద్యలు..వాటి ఫలితాలు... ఏం చేస్తే ఏం వస్తుంది? - poojanilayam

దశ మహా విద్యలు..వాటి ఫలితాలు...
ఏం చేస్తే ఏం వస్తుంది?

1.తొలి మహా విద్య శ్రీకాళీదేవి.💐
కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య.
ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది.
శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది.
తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి,
బాధల నుంచి విముక్తి కలుగుతుంది.
అంతేకాదు శత్రు నాశనం,
దీర్షాయువు,
సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీ తారాదేవి.💐
దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది.
శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత.
ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం,
దివ్యజ్ఞానం,
వాక్సిద్ధి,
ఐశ్వర్యం,
కష్టనివారణ
సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి.💐
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది.
పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమతిథి ప్రీతిపాత్రమైనది.
ఈ తల్లినే లలిత అని,
రాజరాజేశ్వరి అని,
మహాత్రిపురసుందరి
అని అంటారు.
ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి.💐
దశ మహావిద్యలలో 4వ మహావిద్య
శ్రీ భువనేశ్వరీదేవి.
ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే
ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది.
ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి.
ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది.
భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే
శక్తి లభిస్తుంది.
అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని
సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో
సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి.💐
దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి.
ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమతిథి ప్రీతిపాత్రమైనది.
ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి,
బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
సకల సుఖభోగాలను పొందే శక్తి,
సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి
సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి.💐
దశ మహావిద్యలలో 6వ మహావిద్య
శ్రీ ఛిన్నమస్తాదేవి.
ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ
అని కూడా పిలుస్తారు.
వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది.
శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ
ఎంతో ప్రశస్తివుంది.
ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి,
పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి.💐
దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది.
ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు.
తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.
ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి,
శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి.💐
దశమహావిద్యలలో 8వ మహావిద్య..
పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది.
స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది.
ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది.
ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో,
వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి.💐
దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది.
వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది.
రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి,
అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు.
ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి,
సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి,
ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి.💐
పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే
శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది.
సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి
మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం.
శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని
ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.

Popular posts from this blog

చాలా మందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం - poojanilayam

చాలా మందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం          చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్” ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే… ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్

ఏ కార్యాన్ని అయిన నెరవేర్చే అనుభవ పూర్వక శక్తివంతమైన రేణుక దేవి మంత్రం - poojanilayam

( చిన్నమస్త ) రేణుక అమ్మ వారి కృపకు  పాత్రులు  కావాలి అనుకునే వారు క్రింది  మంత్రాన్ని  108 సార్లు  చదవండి ఈ రోజు సాయంత్రం (రోజు 108×3  సార్లు  ఉదయం, సాయంత్రం ,ఇలా 41 రోజులు చదివితె  ఏ కోరిక   అయినా నిరవేరుతుంది) ప్రసాదం పరమాన్నం,పెరుగు ) ఓం మహా విద్యామ్ మహా  మాయాం సర్వ శక్తీ స్వరూపిణీం  భక్తానాం  ఇష్ట దాత్రీమ్  చ    రేణుకంబామ్ అహం  భజే       🔱అతి శక్తివంతమైన రేణుక దేవి మంత్రం , దాసమహావిధ్య లలో చిన్నమస్త దేవి ఇంకొక పేరు రేణుక దేవి🔱 ఓం హ్రీమ్ క్రోమ్  ఐం  శ్రీ రేణుక దేవియే నమః ఇది అమ్మవారి మూల మంత్రం పైన ఇచ్చింది  ధ్యాన  మంత్రం  రేణుక దేవి పరుషరాముని కన్న తల్లి జమదగ్ని  మహా ముని  ఇల్లాలు  ఈ అమ్మ వారు చాల శక్తివంతమైన  అమ్మవారు  ఈ అమ్మవారిని  ఎల్లమ్మ  తల్లి గా అది  జోగుల  దేవిగా  వజ్రవైరోచని(చిన్న మస్తా)  దేవి అని పిలుస్తారు ఈ అమ్మ వారి కృప  ఉంటె మనకు  భవిష్యతు  లో గరగబోయే  విషయాలు  కూడా తెలుస్తాయి    ఈ అమ్మ వారిని  (ఎరుక  చెప్పే   అమ్మవారు అనికూడా అంటారు ) ఈ అమ్మవారు వరి చేను  లో ఉంటె  *వరిగంటల ఎల్లమ్మ* అని  అమ్మవారిని నగ్నం గా పూజించే  వారు *నగ్న ఎల్లమ్మ*  అని *మావురా

CHINNAMASTA - POOJANILAYAM

శ్రీ చిన్న మస్తాసాధన  ( CHINNAMASTA ) - POOJANILAYAM) అది పడైవీడు క్షేత్రం ! రేణుకాలయం కొండల మధ్యన ఉన్న విశాలమైన మైదానమందు నిర్మింపబడి ఉంది ! దానికి కొంత దూరంలో ‘ ‘కమండలు’ నది ప్రవహిస్తూంది. ఆలయాంతర్భాగంలో ఒక మంటపంపై ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకడు వయస్సు చెల్లిన వాడు. రెండవ వాడు యువకుడు, పేరు ‘ధనంజయ శర్మ’.  ( CHINNAMASTA ) “ ఈ ప్రశాంతమైన స్థలంలో కొన్ని రోజులుండి యోగ సాధన చేసుకోవాలని తీర్మానించాను.” అన్నాడు సగం నెరసిన గడ్డాన్ని సర్దుకొంటూ ‘ రామానంద యోగి’. ( CHINNAMASTA )   “ గురుదేవా ! నాకూ అలాంటి ఉద్దేశమే కలిగింది. ఇదివరలో అనేక క్షేత్రాలు చూచాం,కాని ఎక్కడ కూడ ‘శిరస్సు’ మాత్రమే మూల విగ్రహంగా కల క్షేత్రాన్ని చూడలేదు ! దీని ఆంతర్యమేమో గురుపాదులు సెలవియ్యాలని ప్రార్థిస్తున్నాను. ” అని అన్నాడు ధనంజయ శర్మ. “ శర్మా ! స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు పటాపంచలయ్యే ‘ ఛిన్నమస్త’  యొక్క చరిత్రను చెప్తాను ,సావధానంగా విను.ఇక్కడకి క్రోసు దూరంలో ‘ పడైవీడు’ అనే గ్రామం ఉంది. అది పూర్వం కుండిన పురి. దానికి నందన నగరమని పేరు కూడా ఉంది.పడైవీడు అంటే, ‘అరవ భాషలో’ సైనికుల విడిది అ