Skip to main content

కస్తూరి కాయ #Available #kasturi #kaya #original from #rushikesh

#Available #kasturi #kaya #original from #rushikesh

:- our #price = 15000 /-

#Market price = from 80000 to 100000

Contact message me on
=https://www.facebook.com/POOJANILAYAM9/

కస్తూరి జింక కస్తూరిని తయారుచేసే గ్రంధి  కలిగి ఉంటుంది.

"కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్
కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణి"

అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీ
కృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ! ఆ సమయంలో
  ముందు నీకొచ్చిన సందేహం
ఏంటి అంటారా?  ఈ కస్తూరి అనేది
తిలకం పేరా? లేక తిలకాన్నే కస్తూరి అంటారా? అదొక తిలకం
బదులు వాడే ఆభరణమా? కస్తూరి అంటే ఏమిటి? అని.

పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావన
ఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి,
ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది.
మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని
ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది
చూడండి.

"చారు చంపక వర్ణాభం హ్యేక వక్త్రం త్రిలోచనం
ఈషద్ధాస్య ప్రసన్నాస్యం రత్న స్వర్ణాది భూషితం
మాలతీ మలయాయుక్తం సద్రత్న ముకుటోజ్జ్వలం
సత్కంఠాభరణం చారు వలయాంగద భూషితం
వహ్నిశౌచేనాతులైన త్వతి సూక్షేణ చారుణా అమూల్య
వస్త్ర యుగ్మేన విచిత్రేణాతి రాజితం
చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం రత్న
దర్పణ హస్తం చ కజ్జలోజ్జ్వలలోచనం"

అందమయిన సంపెంగల కాంతి వంటి మేని కాంతితో
ప్రకాశించేవాడు, ఒక ముఖము కలవాడు, మూడు
కన్నులు కలవాడు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన
ముఖము కలవాడు, బంగారు రత్నాభరణములతో
అలంకరింపబడినవాడు, మల్లె మాలలను ధరించినవాడు,
గొప్పవైన రత్నములతో పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు,
మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమైన
కంకణములు, అంగదములతో అలంకరింపబడినవాడు,
అగ్నివలే ప్రకాశించే సాటిలేని సన్నని నూలుతో వడకిన
రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు,
చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో
అలంకరింపబడినవాడు, రత్నపుటద్దమును
చేతియందు కలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు
కలవాడు అయినటువంటి ఆ శివుడు కళ్యాణార్థం
సర్వావిధ అలంకృతుడై తరలి వెళ్ళాడు అని శివపురాణంలో
చెప్పబడింది. ఎంత అద్భుతమయిన వర్ణనో కదా! కేవలం
కృష్ణుడి అలంకరణలో వినే కస్తూరిని శివుడు కూడా
వాడటం జరిగిందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!

"కస్తూరి తిలక తిద్దువె కాలిగె గెజ్జె కట్టువె
కాశీ పీతాంబర కొడువె కణ్ణిగె కాడిగె హచ్చువె"

అంటూ ఆ విష్ణువుని భజనలో కూడా కస్తూరిదే
ప్రథమ స్థానం.

 కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి,
మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద
వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.

అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ
నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని
మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది.

ఇన్నిటిలో ముఖ్య పాత్రను పోషించే కస్తూరి గురించి మరికొన్ని
విషయాలు తెలుసుకుందాం.

వాస్తవానికి కస్తూరి అనేది
అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి.
కస్తూరికిలో వెల దాదాపు రెండున్నర లక్షల రూపాయలు!
పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకూ దీనిని సహజసిద్ధంగా
తయారు చేసినా దానికున్న ఎన్నో ఉపయోగాల వలన
కృత్రిమంగా కూడా దీనిని తయారుచేస్తున్నారు.
కస్తూరికి ఆంగ్ల నామమయిన మస్క్ సంస్కృత
పదమయిన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది.
ఇది మగ కస్తూరి జింక (Moschus moschiferus L.)
యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే
ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే పరిమళము.
కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక
శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన,
ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి
ఉంటుంది. ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన
అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో
ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా
మారినప్పుడు అది వాడకానికి సిద్ధమయినదని అర్థం.
ఇంతకీ ఈ మగ జింక కస్తూరిని ఆడ జింకను
ఆకర్షించుకోవడానికి తయారుచేసుకుంటుందిట.
ప్రత్యుత్పత్తి కాలంలో (మే - జూన్) ఎక్కువ శాతం
కస్తూరిని తరాయుచేస్తుంది అని శాస్త్రవేత్తలు
చెప్పారు.దీనిని టిబెట్, చైనా, తదితరప్రాంతాలలో ఎక్కువగా తయారుచేస్తారు.
కృత్రిమంగా
వీటిని పెద్ద మోతాదులో తయారుచేస్తున్నారు. ఆ ఇతర
సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి (ధవళ కస్తూరి)
అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా మటుకు అసలైన
కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాలనుండి
ఉత్పన్నమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా
ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని
పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ
వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే
భావిస్తున్నారు జనాలు. కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన
వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్.
దీనికి ఉన్న ప్రాముఖ్యమయిన పరిమళాన్ని గుర్తించిన
యూరోపియన్లు దానిని perfumes తయారీలో వాడుతారుట.

అదే కాక దానికున్న పరిమళం వలన అగరుబత్తులు,
సాంబ్రాణి అన్నిటికీ కస్తూరి పేరు పెట్టి సొమ్ము
చేసుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజమయిన
జింక కస్తూరిని కలుపుతారో తెలియదు!

సారంగ నాభి,
కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణమదము, ఇట్టి
గోరోజనము, సహస్ర వేధి, లత, మోదిని, మొదలయినవి
కస్తూరి రకములు.

ఆయుర్వేదములో కూడా కస్తూరి ప్రముఖ పాత్రని
పోషిస్తోంది. ఎలా అంటే:

౧. చాలా కాలంగా కస్తూరి మాత్రలను తమలపాకు రసంలో
నూరి తేనెలో కలిపి జలుబుకి, దగ్గుకి ఔషధంగా
వాడుతున్నారు.
౨. గర్భిణీ స్త్రీలకు కస్తూరిని ఎక్కువగా నొప్పులకి
వాడతారు. వాతపు నొప్పులయితే తగ్గుతాయి, అదే పురిటి
నొప్పులయితే కాన్పు జరుగుతుంది అని కస్తూరి
రసం పట్టించేవారు.
౩. వాతానికి అద్భుతమయిన మందు కస్తూరి. అందుకనే
దీనిని తాంబూలంలో కలిపి తింటారు.
౪. అజీర్ణం, కఫం, అతిసారం, అధికమయిన చెమట,
బాలింత ఒంటి నొప్పులు, వాంతులు మొదలయినవాటికి
ఇది పెట్టింది పేరు. తేనెతో కాని అల్లం రసంతో కాని
పరగడపున పట్టిస్తారు.
౫. మనిషి చనిపోయే ముందు శరీరం చల్లబడితే సారంగ
నాభి కస్తూరిని పట్టిస్తే వేడి పుంజుకుని (మరి వాతాన్ని
తగ్గించడానికి వాడతారు అంటేనే తెలుస్తోంది కదా
చల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది అని!) మనిషి
బ్రతుకుతాడని నమ్మిక.
౬. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ,
నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికి
ఇది చక్కని మందు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ
ముఖ్యమయినవి మాత్రం ఇక్కడ పెట్టాను. కస్తూరి
శ్రేష్టతకి మారు పేరు అంటారు.

 శ్రేష్టమయిన
పసుపుని కస్తూరి పసుపు అనీ శ్రేష్టమయిన
కుంకుమని కస్తూరి కుంకుమ అనీ అంటారు.

కస్తూరిని మన కవులు మాత్రం వదులుతారా?

ముఖ్యంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది పద్యాలలో
తారసపడుతుంది.
"మృగ మదంబు చూడ మీ(ద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!"

కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా ఏ విధముగా ఐతే మంచి
వాసన వెదజల్లుతుందో అదే విధముగా గొప్పవారు బయటకి
ఆడంబరము లేకపోయినా గొప్ప శక్తి కలవారై ఉండును.
దేనినీ రంగు లేదా హంగు చూసి మోసపోకూడదు అన్నది
దీని నీతి.

"కన్నె దాని మేను కస్తూరి వాసన
ముసలిదాని మేను ముఱికి కంపు
వయసుదాని మేను వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినురవేమ!"

"గార్ధబంబెరుగునా కస్తూరి వాసన
మిక్కుటంగ చెడుగు మేసుగాక
నుత్తమోత్తములకు వత్తురా వేశ్యలు
విశ్వదాభిరామ వినురవేమ!"

వీటిని నేను ప్రత్యేకంగా వివరించ వలసిన అవసరము
లేదనుకుంటాను. అంత సరళమయిన భాష వాడారు.
అందులోని అంతరార్థం మీ ఊహకే వదిలేస్తున్నాను!

అంతే కాకుండా కస్తూరిని తిలకదారనలోను,పండుగలు విశేష కార్యక్రమాలలో దేవుళ్ళకు అభిషేకం లోను వాడుతారు.ఈ సుగంధద్రవ్యం ప్రత్యేక సువాసనే కాదు ప్రతేక ఆకర్షణని కూడా కలిగి ఉంటుంది.

కస్తూరిని ఆరోగ్యం ,అభిషేకం,పూజ ,హోమం మొదలైన వాటిలో వాడుతారు

Popular posts from this blog

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు - Poojanilayam

సౌందర్యలహరి - సకల కామ్యాలకి శక్తివంతమైన సులభంగా తయారు చేసుకునే యంత్రాలు. ఏ కార్యాన్ని అయిన అవలీలగా చేసే శక్తి ఈ యంత్రాల కి ఉన్నది

ఏ కార్యాన్ని అయిన నెరవేర్చే అనుభవ పూర్వక శక్తివంతమైన రేణుక దేవి మంత్రం - poojanilayam

( చిన్నమస్త ) రేణుక అమ్మ వారి కృపకు  పాత్రులు  కావాలి అనుకునే వారు క్రింది  మంత్రాన్ని  108 సార్లు  చదవండి ఈ రోజు సాయంత్రం (రోజు 108×3  సార్లు  ఉదయం, సాయంత్రం ,ఇలా 41 రోజులు చదివితె  ఏ కోరిక   అయినా నిరవేరుతుంది) ప్రసాదం పరమాన్నం,పెరుగు ) ఓం మహా విద్యామ్ మహా  మాయాం సర్వ శక్తీ స్వరూపిణీం  భక్తానాం  ఇష్ట దాత్రీమ్  చ    రేణుకంబామ్ అహం  భజే       🔱అతి శక్తివంతమైన రేణుక దేవి మంత్రం , దాసమహావిధ్య లలో చిన్నమస్త దేవి ఇంకొక పేరు రేణుక దేవి🔱 ఓం హ్రీమ్ క్రోమ్  ఐం  శ్రీ రేణుక దేవియే నమః ఇది అమ్మవారి మూల మంత్రం పైన ఇచ్చింది  ధ్యాన  మంత్రం  రేణుక దేవి పరుషరాముని కన్న తల్లి జమదగ్ని  మహా ముని  ఇల్లాలు  ఈ అమ్మ వారు చాల శక్తివంతమైన  అమ్మవారు  ఈ అమ్మవారిని  ఎల్లమ్మ  తల్లి గా అది  జోగుల  దేవిగా  వజ్రవైరోచని(చిన్న మస్తా)  దేవి అని పిలుస్తారు ఈ అమ్మ వారి కృప  ఉంటె మనకు  భవిష్యతు  లో గరగబోయే  విషయాలు  కూడా తెలుస్తాయి    ఈ అమ్మ వారిని  (ఎరుక  చెప్పే   అమ్మవారు అనికూడా అంటారు ) ఈ అమ్మవారు వరి చేను  లో ఉంటె  *వరిగంటల ఎల్లమ్మ* అని  అమ్మవారిని నగ్నం గా పూజించే  వారు *నగ్న ఎల్లమ్మ*  అని *మావురా

చాలా మందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం - poojanilayam

చాలా మందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం          చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్” ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే… ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి. ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్